తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందరు టాప్‌ హీరోల సరసన హీరోయిన్లుగా నటించిన తమన్నా, కాజల్‌ కరెన్సీ స్కామ్‌లో ఇరుక్కున్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు రావాల్సిందిగా పుదుచ్చేరి పోలీసులు నోటీసులు జారీ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో పుదుచ్చేరిలో క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ప్రజల్ని మోసం చేస్తున్నారని, 10 మంది నుంచి దాదాపు రెండున్నర కోట్ల రూపాయలను వసూలు చేశారని అశోకన్‌ విశ్రాంత అనే ప్రభుత్వ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కాజల్‌, తమన్నాలను విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. 

2022లో కోయంబత్తూరులో క్రిప్టో కరెన్సీ మెయిన్‌ బ్రాంచ్‌ ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి హీరోయిన్‌ తమన్నా హాజరైంది. అలాగే ఓ స్టార్‌ హోటల్‌లో జరిగిన క్రిప్టో కరెన్సీ కంపెనీ కార్యక్రమంలో కాజల్‌ అగర్వాల్‌ పాల్గొన్నారు. ఆ తర్వాత ముంబయిలో భారీ పార్టీ నిర్వహించి ఎంతోమంది నుంచి అధికంగా డబ్బు సేకరించారు. అధిక లాభాలు ఇస్తామంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారన్న ఆరోపణలతో నితీష్‌ జైన్‌, అరవింద్‌కుమార్‌ అనే వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. వారు అందించిన సమాచారం మేరకు కాజల్‌, తమన్నాలను త్వరలోనే విచారిస్తారని తెలుస్తోంది. అయితే ఈ స్కామ్‌లో కాజల్‌, తమన్నా ప్రమేయం ఉందా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here