తుహిన్ కాంత పాండే విద్యార్హతలు
పాండే చండీగఢ్ లోని పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో ఎంఏ, బర్మింగ్ హామ్ యూనివర్సిటీ (యూకే) నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఒడిశా ప్రభుత్వంలో, భారత ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేశారు. పాండే తన కెరీర్ ప్రారంభంలో ఆరోగ్యం, సాధారణ పరిపాలన, వాణిజ్య పన్నులు, రవాణా మరియు ఆర్థిక విభాగాలలో పరిపాలనా అధిపతిగా పనిచేశాడు. ఒడిశా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా, ఒడిశా స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేశారు.