ఈ సంవత్సరం కూడా సేమ్
2024-25 సంవత్సరానికి ఈపీఎఫ్ పై 8.25 శాతం వడ్డీ రేటును అందించాలని ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణాయక సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) శుక్రవారం జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సీబీటీ నిర్ణయం తర్వాత, 2024-25 సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును సమ్మతి కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపుతారు. ప్రభుత్వం ఆమోదించిన తర్వాత, 2024-25 సంవత్సరానికి ఈపీఎఫ్ పై లభించే వడ్డీ ఈపీఎఫ్ఓలోని ఏడు కోట్లకు పైగా చందాదారుల ఖాతాల్లో జమ అవుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా ప్రభుత్వం ఆమోదించిన తర్వాతే ఈపీఎఫ్ఓ వడ్డీ చందాదారుల ఖాతాల్లో చేరుతుంది.