ఆన్లైన్ గేమ్స్ బారిన పడిన విజయ భాస్కర్ పలువురి వద్ద అప్పులు చేశాడని స్థానికులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తు న్నారు. విజయభాస్కర్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.