హైదరాబాద్ నగరంలోని చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పర్యటించారు. పలు చెరువులను పరిశీలించి.. వివరాలను తెలుసుకున్నారు. చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.