ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ లో మార్కోస్ టన్నెల్ జాయిన్ కానుంది. ఇండియన్ మెరెయిన్ కమాండో ఫోర్స్ కూడా సహాయ చర్యల్లో పాల్గొంది. ఈ కమాండో టీం నేల, నీరు, ఆకాశంలో రెస్క్యూ కార్యక్రమాలు చేపడతారు. ఆపరేషన్ మార్కోస్ రంగంలోకి దిగిన నేపథ్యంలో టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులు బయటకు వస్తారని అందరూ ఆశిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకునేందుకు సొరంగంపై నుంచి కాని, పక్క నుంచి కానీ వెళ్లే మార్గాలనూ అన్వేషిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.