ఇక అద్దంకి దయాకర్ పేరు బలంగా వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఆయనకు అవకాశం దక్కలేదు. ఇప్పటివరకు ఎలాంటి నామినేటెడ్ పదవి కూడా రాలేదు. దీంతో ఆయన… ఎమ్మెల్సీ సీటుపై గంపెడు ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక మరో సీనియర్ సంపత్ కుమార్ కూడా సీటును ఆశిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ నుంచి పోటీ చేసిన ఓడిపోయారు. నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆశించగా… దక్కలేదు. అయితే ఎమ్మెల్సీ సీటు దక్కుతుందని చూస్తున్నారు. వీరే కాకుండా సీనియర్ నేతగా ఉన్న జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, మహమ్మద్ అజారుద్దీన్ తో పాటు ఫిరోజ్ ఖాన్, ఖురేషీ వంటి నేతలు కూడా పావులు కదుపుతున్నారు. పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జట్టి కుసుమ కుమార్, హర్కార వేణు గోపాల్ రావు, సామా రామ్మోహన్ రెడ్డి, పిడమర్తి రవి, సింగాపురం ఇందిరాతో పాటు మరికొంత మంది నేతలు సీటును ఆశిస్తున్నారు.