రెండు ఇవ్వాల్సిందే!
ప్రస్తుతం సంఖ్యాబలం ఆధారంగా చూస్తే.. కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీ సీట్లు దక్కే అవకాశం ఉంది. వీటి కోసం ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పదవులను భర్తీ చేయడం ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్‌కు పెద్ద పరీక్షలా మారింది. అయితే.. అందర్నీ సంతృప్తిపరచేలా బీసీ, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఒక్కో సీటు ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. కానీ.. బీసీ నేతలు మాత్రం రెండుకు తగ్గితే ఒప్పుకనే పరిస్థితి కనిపించడం లేదని.. పార్టీకి సీనియర్ నేత ఒకరు ‘హిందుస్తాన్ టైమ్స్ తెలుగు’ ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు.