సినిమాపేరు:బందీ
నటీనటులు:ఆదిత్య ఓం
దర్శకత్వం: రఘు తిరుమల
కథ-స్క్రీన్ ప్లే:ఆదిత్య ఓం
మాటలు: ఆదిత్య ఓం,కార్తీక్
సినిమాటోగ్రఫి:మధుసూదన్ కోట
ఎడిటర్: ప్రకాష్ జా
సంగీతం:లావన్-వీరల్, సుదేష్ సావంత్
నిర్మాతలు: రఘు తిరుమల,వెంకటేశ్వరావు దగ్గు
బ్యానర్ :గల్లీ సినిమా
సమర్పణ: తిరుపతి పొన్నాల
రిలీజ్ డేట్: 28 – 02 -2025
వైవీఎస్ చౌదరి(Yvs chowdary)దర్శకత్వంలో వచ్చిన’లాహిరి లాహిరి లాహిరి’ మూవీతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని పొందిన ‘ఆదిత్య ఓం'(Aditya om)ఈ రోజు ‘బంది'(Bandi)అనే కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.వన్ మ్యాన్ షో మూవీ కావడం,ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో,ప్రేక్షకుల్లో ‘బంది’పై ఒకింత ఆసక్తి నెలకొని ఉంది.మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
ఆదిత్య వర్మ (ఆదిత్య ఓం) ఒక పేరుమోసిన లాయర్.డబ్బు,విచ్చలవిడి సుఖాలు మాత్రమే నిజమని నమ్మే ఆదిత్య కట్టుకున్న భార్యని,కొడుకుని పట్టించుకోడు.ఒక కేసు వాదించడానికి భారీ మొత్తంలో డబ్బు తీసుకుంటాడు.గర్ల్ ఫ్రెండ్ కోసం ఆదిత్య ఒక రిసార్ట్ లో వెయిట్ చేస్తుంటాడు.కాకపోతే ఆ గర్ల్ ఫ్రెండే ఆదిత్య ని మనుషులు తిరగని ఒక అడవిలో బందీగా ఉండేలా చేస్తుంది.ఆ అమ్మాయి ఎందుకు ఆదిత్య ని అడవిలో బందీ గా ఉండేలా చేసింది? అడవిలో ఆదిత్య పడ్డ కష్టాలేంటి? అసలు ఆదిత్య చేసిన తప్పు ఏంటి? ఒక వేళ తప్పు చేసి ఉంటే అడవి ద్వారా ఆదిత్య ఏమైనా గుణపాఠం నేర్చుకున్నాడా ? అసలు ఈ కథ యొక్క లక్ష్యం ఏంటి? అనేదే ఈ చిత్ర కథ
ఎనాలసిస్
నూటికి నూరు శాతం ఇది మంచి కథే.నేటి సమాజంలో కొంత మంది మనుషులు తమని తాము మంచి వాళ్ళుగా భావిస్తు,డబ్బు మీద వ్యామోహంతో,అహంకారంతో ప్రవర్తిస్తు ఎన్నో తప్పులు చేస్తున్నాడు.తద్వారా సమాజానికి ఎంతో అన్యాయం చేస్తున్నారు.ఈ అంశాలనే ఆదిత్య ఓం క్యారక్టర్ ద్వారా ప్రేక్షకులకి చెప్పే ప్రయత్నం చేసారు.కానీ కథనంలోని లోపాలవల్ల ప్రేక్షకుడుకి ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి.ఈ కథ లక్ష్యం ఏంటో ఆ పాయింట్స్ ఆధారంగా సీన్స్ ని ఎలివేట్ చెయ్యాల్సింది.ఒక రెండు మూడు సీన్స్ మాత్రమే ఎలివేట్ అయ్యాయి.ఆదిత్య ఒక్కడే స్క్రీన్ పై కనపడతాడు కాబట్టి డైలాగులు చాలా చాలా ఇంపార్టెంట్.కాబట్టి డైలాగులపై మరింత శ్రద్ధ చూపించి ఉంటే,సినిమా రేంజ్ వేరేలా ఉండేది.ఇలాంటి సినిమాలకి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ని విడమరిచి చెప్పలేం.కాకపోతే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బెటర్.మూవీ ఎంట్రీ మంచి ఇంట్రెస్ట్ తోనే సాగింది.కాకపోతే ఎంత సేపు ఓకే బాడీ లాంగ్వేజ్ తో ఆదిత్య ని డల్ గా చూపించాల్సిన అవసరం లేదు.ఆదిత్య ఎలాగు అమ్మాయిల వ్యామోహం ఉన్నోడు. కాబట్టి ఆదిత్య అడవిలో ఆ కోణంగా ఆలోచిస్తు అమ్మాయిల కోసం వెతకడం కామెడీ గా చూపించాల్సింది.తన గత చిత్రాల్లో ఆదిత్య ఎంతలా కామెడీ చేస్తాడో తెలిసిందే.పైగా ఈ కథకి రెండు భాగాల్లోను సీరియస్ నెస్ అవసరం లేదు.అడవిలోనే సంతోషం, భయం, దుఃఖం ఈ మూడింటిని అంచెలంచెలుగా తీసుకెళ్తు,మెయిన్ పాయింట్ ని క్లైమాక్స్ లో చెప్పి ఉండే బాగుండేదేమో.ఆదిత్యలాయర్ కాబట్టి అడవికి వ్యతిరేకంగా కోర్టులో వాదించే సీన్స్ ని కూడా చూపించాల్సింది. ఈ కథ లక్ష్యం ఏంటో ఆ లక్ష్యానికి సంబంధించిన సన్నివేశాలని మరింతగా ఎలివినేట్ చెయ్యడంతో పాటు,నేచర్ మనకి ఏం ఇస్తుందో కూడా ఆదిత్య తెలుసుకునేలా సీన్స్ రాసుకోవాల్సింది..
నటీనటులు,సాంకేతిక నిపుణుల పని తీరు
ఆదిత్య ఓం తన క్యారక్టర్ కి సంబంధించిన అన్ని రకాల వేరియేషన్స్ లోను అద్భుతంగా నటించి,మరోసారి ప్రేక్షకాభిమానాన్ని పొందాడు.ముఖ్యంగా ఫొటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.బందీకి ఆ రెండు ప్రాణంగా నిలిచాయి.ప్రేక్షకుడు తన కళ్ళని పక్కకు తిప్పుకోకుండా ఆ రెండు డిపార్ట్మెంట్ పని చేసాయంటే అతిశయోక్తి కాదు.దర్శకుడి పని తనం బాగున్నా,కథనాల విషయంలో దర్శకుడు మరింతగా శ్రద్ధ చుపించాల్సింది.మాటలు మాత్రం అసలు బాగోలేదు. రెండు లొకేషన్స్ కాబట్టి నిర్మాణ విలువల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు.
ఫైనల్ గా చెప్పుకోవాలంటే సింగల్ క్యారక్టర్ తో సమాజానికి ఒక మంచి మెసేజ్ చెప్పాలని మేకర్స్ ప్రయత్నం చేసారు.కానీ కథనం,డైలాగులు బాగోకపోవడం ‘బందీ’ కి కొంచం మైనస్ గా పరిగణించవచ్చు .దీంతో ప్రేక్షకులని తన ‘బందీ’ గా చేసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయేమో.
రేటింగ్ 2.5 /5 అరుణాచలం