విమర్శలు
మొండి పట్టుపట్టి మరీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్ చేజేతులారా పరువు తీసుకుంది. ఒక్క విజయం లేకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక నిర్వహణ లోపాలు పాకిస్థాన్ కు చెడ్డపేరు తెస్తున్నాయి. రావల్పిండి లో రెండు మ్యాచ్ లు వర్షం వల్ల రద్దయ్యాయి. లాహోర్ లో ఓ మ్యాచ్ వాషౌట్ అయింది. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ప్రతిష్టాత్మక ఐసీసీ టోర్నీల్లో ఇలా జరగడంతో పాక్ పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.