మొలకలతో పొంగనాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:

  • నానబెట్టిన మొలకలు రెండు కప్పులు
  • మీకు నచ్చిన ఆకుకూరలు రెండు కప్పులు
  • శనగపిండి ఒక కప్పు
  • చిన్న అల్లం ముక్క
  • కప్పు నీరు
  • ఒక టీస్పూన్ కారం పొడి
  • వేయించిన జీలకర్ర పొడి రెండు టీస్పూన్లు
  • ఉప్పు రుచికి సరిపడా
  • నెయ్యి లేదా నూనె
  • బేకింగ్ పౌడర్ లేదా బేకింగ్ సోడా

మొలకలతో పొంగనాలు తయారు చేసే విధానం:

  1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో మొలకెత్తిన విత్తనాలు, మీకు నచ్చిన ఏవైనా ఆకుకూరలు, శనగపిండి, అల్లం ముక్క నీరు పోసి బాగా కలపండి.
  2. తర్వాత వీటన్నింటినీ మిక్సీ జార్ లో వేసి మెత్తటి పేస్టులా తయారు చేయండి.
  3. ఇప్పడు ఈ మిశ్రమంలో కారంపొడి, వేయించిన పొడి చేసుకున్న జీలకర్ర పొడి, బేకింగ్ సోడాతో పాటు రుచికి సరిపడా ఉ్పు వేసి బాగా కలపండి. బేకింగ్ సోడా లేకపోతే బేకింగ్ పౌడర్ లేదా ఒక ప్యాకెట్ ఈనో పౌడర్ వేసుకున్నా సరిపోతుంది.
  4. ఇప్పుడు పొంగనాలు వేసే పెనం తీసుకుని అడుగు భాగంలో నెయ్యి అప్లై చేసి మనం తయారు చేసి పెట్టుకున్న స్ప్రౌట్స్ మిశ్రమాన్ని పొంగనాలలా వేయండి.
  5. వీటిని పది నుంచి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేం మీద ఉడికించి మరో వైపుకు తిప్పండి.
  6. ఉడికిందో లేదో తెలుసుకోవడానికి టూత్ పిక్స్ ను లోపలికి గుచ్చి తెలుసుకోవచ్చు.
  7. రెండు వైపులా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. అంతే ఆరోగ్యకరమైన రుచికరమైన మొలకల పొంగనాలు రెడీ అయినట్టే.

వీటిని కొబ్బరి చట్నీ లేదా పళ్లీ చట్నీ లేదా టమాటో చట్నీతో కలపి పెట్టారంటే పిల్లలు ఒక్కటి కూడా వదలకుండా తినేస్తారు. మల్లీ మల్లీ అవే కావాలని కూడా అడుగుతారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా వీటిని బాగా ఎంజాయ్ చేస్తారు. బరువు విషయంలో, ఆరోగ్యం విషయంలో ఎలాంటి భయం, బెంగ అవసరం లేకుండా వీటిని నిస్సందేహంగా తినచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here