హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి(Anil ravipudi)రీసెంట్ గా’సంక్రాంతికి వస్తున్నాం'(Sankrathiki Vasthunnam)మూవీతో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.సంక్రాంతి విన్నర్ గా నిలిచిన ఈ మూవీ విక్టరీ వెంకటేష్ కెరీరి లోనే 250 కోట్లకి పైగా సాధించిన మొట్టమొదటి మూవీగా నిలిచింది.వెంకీ సినీ జర్నీలో సుస్థిర స్థానాన్ని కూడా సంపాదించినట్టే.వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రముఖ టెలివిజన్ ఛానల్ లో ఈ రోజు టెలికాస్ట్ కాబోతుంది.
రీసెంట్ గా అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు యూట్యూబ్(You Tube)లలో అందమైన వాయిస్ఓవర్ లు ఇస్తు నా గురించి ఇష్టమొచ్చినట్టుగా కథల్ని అల్లేస్తు, వీడియోలు క్రియేట్ చేస్తున్నారు.వాటిని చూసిన మా బంధువులు,ఆత్మీయులు నా భార్యకి పంపి,అనిల్ గురించి ఇలా అంటున్నారేంటని అడుగుతున్నారు.ఈ విషయంపై నేను ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేశాను.కాబట్టి మర్యాదగా వీడియోలు తీసెయ్యండి.ఇకపై అలాంటి వీడియోస్ కూడా చెయ్యకండి, లేదంటే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో పెడతారు.
నా గురించే కాదు,చాలా మంది గురించి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.క్లిక్స్ కోసం నచ్చిన కథల్ని అల్లి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేసేస్తున్నారు.అలాంటి వీడియోస్ వల్ల ఎంతో మంది వ్యక్తిగతంగా ఇబ్బంది పడుతున్నారు.కాబట్టి లేని వార్తలు రాయకండని ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు .అనిల్ రావిపూడి తన నెక్స్ట్ మూవీని మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నాడనే టాక్ అయితే కొన్ని రోజుల నుంచి వినపడుతుంది.ఇందుకు నిదర్శనంగా ఈ మధ్య చిరంజీవి హాజరైన కొన్ని సినిమా ఫంక్షన్స్ కి అనిల్ కూడా హాజరయ్యాడు.అయితే ఈ కాంబోలో మూవీ గురించి అధికార ప్రకటన అయితే రావాల్సి ఉంది.