ఎలాంటి వ్యాయామాలు చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి:
- వీటికి బదులుగా వ్యాయామం, వాకింగ్, డీప్ బ్రీతింగ్, స్విమ్మింగ్, అరోబిక్స్ వంటివి చేయండి.
- అలాగే హెడ్ లిఫ్ట్స్, షోల్డర్ లిఫ్ట్స్, కర్ల్ అప్స్, బ్రిడ్జ్ వ్యాయామాలు, పెల్విక్ టిల్ట్, ఫ్లట్టర్ కిక్స్, పైలెట్స్, కెగెల్ వ్యాయామాలు చేయడం మంచి ఫలితాలు ఇస్తాయి.
- వీటితో పాటు ఇంట్లోనే తయారు చేసుకన్న సహజసిద్దమైన పానీయాలు అయిన దాల్చిన చెక్క నీరు, గ్రీన్ టీ వంటివి ప్రతి రోజూ ఉదయాన్నే తాగడం వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గే అవకాశాలు మెండుగా ఉంటాయి.
- ముఖ్యంగా బయట దొరికే ప్రాసెస్డ్, ఫ్రైయిడ్ ఆహారాలను తినడం వల్ల పొట్ట మరింత పెరుగుతుంది కనుక పొట్ట తగ్గాలనుకునే వారు ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండండి. ఫైబర్ అధికంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించి మాత్రమే మేము ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.