మారుతి సుజుకి బ్రెజ్జా లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు

మారుతి సుజుకి బ్రెజ్జా ధర పెరిగింది. ప్రారంభ ధర ఇప్పుడు రూ. 8.69 లక్షలు ఎక్స్-షోరూమ్. ఎల్ఎక్స్ఐ వేరియంట్ ధర రూ. 15,000 పెరిగింది. వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ వేరియంట్‌ల ధరలు వరుసగా రూ. 5,500, రూ. 11,500 పెరిగాయి. టాప్-ఎండ్ మోడల్ జెడ్ఎక్స్ఐ + వేరియంట్‌ ధర మారలేదు. బ్రెజ్జాలో అనేక సెక్యూరిటీ ఫీచర్లతో అప్ డేట్ చేశారు. ఇందులో కూడా ప్రామాణికంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తున్నారు. అదనంగా, త్రీ-పాయింట్ ఈఎల్ఆర్ రియర్ సెంటర్ సీట్‌బెల్ట్‌లు, ముందు ప్రయాణీకులకు ఎత్తు సర్దుబాటు చేయగల సీట్‌బెల్ట్‌లు, 60:40 స్ప్లిట్ రియర్ సీట్లు, కప్ హోల్డర్‌లతో రియర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, రియర్ సీట్లకు సర్దుబాటు చేయగల హెడ్‌రెస్ట్‌లను చేర్చింది. ఈ లక్షణాలు ఇప్పుడు అన్ని మారుతి సుజుకి బ్రెజ్జా వేరియంట్లలో ప్రామాణికంగా ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here