ఉపాధ్యాయుల బదిలీలపై కసరత్తు
ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతలపై కసరత్తు ప్రారంభమైంది. వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతలు చేపట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే సీనియారిటీ జాబితాను సిద్ధం చేయాలని అన్ని జిల్లాల డీఈవోలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే జిల్లాల వారీగా సీనియారిటీ జాబితాను తయారు చేసే కసరత్తులో జిల్లాల విద్యాశాఖ అధికారులు ఉన్నారు. సీనియారిటీ జాబితాలను సిద్ధం చేసి, విద్యాశాఖకు పంపాలని అధికారులను ఆదేశించారు.