నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన ‘అఖండ’ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ‘అఖండ 2’ రూపొందుతోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య-బోయపాటి కాంబో కావడంతో పాటు, ‘అఖండ’ సీక్వెల్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పైగా అఖండ-2 ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందిస్తున్నారు. అందుకే బోయపాటి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
లాక్ డౌన్ సమయంలో తక్కువ టికెట్ ధరలు, లో ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ ‘అఖండ’ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లు సాధించింది. ఇందులో శివ భక్తుడిగా అఘోర పాత్రను బాలయ్య పోషించిన ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అఖండ అప్పుడే పాన్ ఇండియా మూవీగా విడుదలై ఉంటే, బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు అఖండ-2 తో అది సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రకటన నుంచే ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అఖండ-2 లో బాలకృష్ణను ఢీ కొట్టే పాత్రలలో సంజయ్ దత్, ఆది పినిశెట్టి నటిస్తున్నారనే వార్తలు ఈ సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఆర్టిస్టుల విషయంలోనే కాదు, లొకేషన్స్ విషయంలోనూ బోయపాటి స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు సమాచారం.
అఖండ-2 షూటింగ్ కోసం హిమాలయాల్లో రెక్కీ చేస్తున్నారట. అఘోర గెటప్ లో బాలకృష్ణ ఇంట్రడక్షన్ సీన్ తో పాటు, పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం.. లొకేషన్ల వేట చేస్తున్నారట. ఇండియన్ సినీ చరిత్రలో ఇంతవరకు హిమాలయాల్లో ఎవరూ చూపించని సరికొత్త లొకేషన్లలో అఖండ-2 షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. యాక్షన్, ఎమోషన్స్, లొకేషన్స్, డైలాగ్స్ ఇలా దేని పరంగా చూసినా.. అఖండతో పోలిస్తే అఖండ-2 ఎన్నో రెట్లు గొప్పగా ఉండబోతుందని అంటున్నారు.