నేటి నుంచి ఏపీ ఇంటర్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ ఏడాది పది లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పేపర్ లీకేజీ వంటి వదంతులు వ్యాపింపజేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు స్పష్టం చేశారు.