సమ్మెలోకి వంద శాతం ఉద్యోగులు, అధికారులు
బీఈఎఫ్ఐ, ఏఐబీఈఏ, ఏఐబీఓసీ, ఎన్‌సీబీఈ, ఎఐబీఓఏ, ఐఎన్‌బీఈఎఫ్, ఐఎన్‌బీంసీ, ఎన్ఓబీడబ్ల్యు, ఎన్ఓబీఓ సంఘాలు సంయుక్తంగా సమ్మెకు పిలుపు ఇచ్చాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా వంద శాతం బ్యాంకు ఉద్యోగులు, అధికారులు సమ్మెలో భాగస్వామ్యం కానున్నట్లు బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఐ) ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఆర్. అజయ్ కుమార్, తెలంగాణ ప్రధాన కార్యదర్శి పి.వెంటకరాములు తెలిపారు. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో ప్రధానంగా అన్ని కేడర్లలో తగినంత నియామకాలు జరపాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.