రైలు మార్చి 21 తేదీన మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబుబాబాద్, డోన్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా తమిళనాడులోని అరుణాచలం, కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తంజావూరు, తిరుచ్చి, కేరళలోని త్రివేండ్రం తదితర ప్రాంతాలను సందర్శించి తిరిగి మార్చి 29న తెల్లవారు జామున 2.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.