వజక్కాయ్ వరువల్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

  • పచ్చి అరటికాయలు – 2
  • పసుపు – రెండు టీ స్పూన్లు
  • ఉప్పు – రుచికి తగినంత
  • కారం పొడి – రెండు టీ స్పూన్లు
  • ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్
  • జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్
  • గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్
  • సెనగ పిండి – అర కప్పు
  • బియ్యపు పిండి – ఒక టేబుల్ స్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
  • చింతపండు రసం – రుచికి తగినంత
  • నూనె – రెండు టీ స్పూన్లు

వజక్కాయ్ వరువల్ తయారు చేసే విధానం:

  1. ముందుగా బాగా తయారైన అరటికాయలను రెండింటిని తీసుకోవాలి.
  2. వాటిని తోలు తీసి గుండ్రంగా, స్లైసెస్ మాదిరిగా కట్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఆర బెట్టుకోవాలి.
  3. ఇప్పుడు వాటిపై పసుపు, ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, సెనగ పిండి, బియ్యపు పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు రసం వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకునేందుకు రెండు టీ స్పూన్ల నూనె కూడా పోసుకోవాలి.
  4. అరటి ముక్కలను బాగా కలుపుతూ మిశ్రమం పూర్తిగా పట్టేలా చూసుకోవాలి.
  5. మసాలా బాగా అంటిన ముక్కలను 5 నుంచి 10 నిమిషాల వరకూ అలాగే ఉంచాలి.
  6. ఇప్పుడు కడాయిలో నూనె లేదా నెయ్యి వేసి అది వేడెక్కిన తర్వాత, బనానా స్లైసెస్ ను వేయాలి.
  7. వాటిని అటూ ఇటూ తిప్పుతూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకూ వేగనివ్వాలి.
  8. వేగుతున్న సమయంలో అందులో కొన్ని కరివేపాకు ఆకులను వేసి వేయించుకోవాలి.
  9. అంతే వీటిని మీ ఆహారంలోకి సైడ్ డిష్ గానైనా, లేదంటే స్నాక్స్ మాదిరిగానైనా ఎంజాయ్ చేయవచ్చు.

దీనిని తమిళనాడులో సంధ్యా మీల్ లేదా థాలీ మీల్స్ లో భాగంగా తీసుకుంటారు. కేరళలో వజక్కాయ్ మేఝుక్కుపురాట్టి అనే పేరుతో పిలుస్తారు. వెజిటేరియన్ మీల్స్ లో ప్రతిసారీ ఇది తింటుంటారు. కర్ణాటకలో సాంబార్ తో పాటు లేదంటే పెరుగుతో పాటు వీటిని ప్రిపేర్ చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో బనానా ఫ్రైని బాగా ఇష్టపడతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here