స్పిరిట్.. ఎంగేజింగ్‍గా ఉంటుంది
సందీప్ రెడ్డి వంగా తదుపరి రెబల్ స్టార్ ప్రభాస్‍తో స్పిరిట్ చిత్రం చేయనున్నారు. ఈ చిత్రంపై భారీ క్రేజ్ ఉంది. “షాహిద్ కపూర్, రణ్‍బీర్ కపూర్‌కు వారి కెరీర్లో అప్పటికే బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చారు. ప్రభాస్‍కు కూడా ఇస్తారని అనుకుంటున్నారా” అనే ప్రశ్న సందీప్‍కు ఎదురైంది. ప్రభాస్‍కు బిగ్గెస్ట్ హిట్ ఇవ్వాలంటే రూ.2000కోట్లు కావాలని, ఆ విషయంపై ఇప్పుడేం చెప్పలేమని సందీప్ చెప్పారు. “ఇది కష్టమైన ప్రశ్న. బాహుబలి 2ను దాటాలంటే రూ.2000 కోట్ల కలెక్షన్లు రావాలి. అయితే నేను కచ్చితంగా ఎంగేజింగ్‍గా మూవీ తెరకెక్కిస్తా. ఇంట్రెస్టింగ్‍గా ఉంటుంది” అని సందీప్ చెప్పారు. బిజినెస్ గురించి తర్వాత చూడాలి అని అన్నారు. సందీప్‍తో ఏదైనా సాధ్యమే అని కోమల్ చెప్పారు.