ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ దగ్గరకు ఉస్మానియా ఫోరెన్సిక్ టీమ్ చేరుకుంది. అటు గల్లంతైన వారి కుటుంబసభ్యులు, బంధువులు కూడా అక్కడి వచ్చారు. ప్రమాద స్థలం వరకు అధికారులు లోకో ట్రాక్‌ను సిద్ధం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన స్థలంలో 200 మీటర్ల పొడవు, 9.2 మీటర్ల బురద, మట్టి, రాళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. లోకో ట్రైన్ను 13.5 కి.మీ వరకు తీసుకొచ్చి.. మట్టిని బయటకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు.