ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్ – 2025కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. గత నెల 25 నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావాల్సినప్పటికీ… స్థానికత విషయంలో సందిగ్ధత ఉండటంతో అధికారులు వాయిదా వేశారు.