యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు – ముఖ్య వివరాలు

  • ఇవాళ మహావిష్ణువు సర్వసేనాధిపతి విష్వక్సేన ఆళ్వార్లకు తొలిపూజను జరుపుతారు. సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు.
  • మార్చి 2వ తేదీన ఉదయం 11 గంటలకు ధ్వజారోహణం ఉంటుంది.
  • మార్చి 3 – ఉదయం మత్స్యావతార అలంకార శేష, వేదపారాయణములు ప్రారంభమవుతాయి. రాత్రి 7 గంటలకు శేష వాహన సేవ ఉంటుంది.
  • మార్చి 4 – ఉదయం వటపత్రశాయి అలంకార సేవ ఉంటుంది. రాత్రి హంస వాహన సేవ
  • మార్చి 5 – శ్రీ కృష్ణాలంకారము శేవ నిర్వహిస్తారు. రాత్రి పొన్న వాహన సేవ ఉంటుంది.
  • మార్చి 7వ తేదీన రాత్రి ఎదుర్కోలు వేడుక ఉంటుంది.
  • మార్చి 8వ తేదీన రాత్రి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు.
  • మార్చి 9వ తేదీన రాత్రి 8 గంటలకు దివ్యవిమాన రథోత్సవం ఉంటుంది.
  • మార్చి 11వ తేదీన గర్భాలయంలోని మూలవరులకు నిర్వహించే సహస్ర ఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.

వార్షిక బ్రహ్మోత్సవాల కారణంగా…. కల్యాణాలు, హోమాలు, జోడు సేవలు, ఏకాదశి లక్ష పుష్పార్చన సేవను రద్దు చేసినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఇక బ్రహ్మోత్సవాలకు సంబంధించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here