ఇప్పటివరకు 13 మంది పిల్లలకు జన్మనిచ్చిన ప్రపంచ కుబేరుడు, టెస్లా, ఎక్స్, స్పేస్ ఎక్స్ తదితర దిగ్గజ కంపెనీల యజమాని ఎలన్ మస్క్ మరోసారి తండ్రయ్యాడు. ఆయన భాగస్వామి షివోన్ జిలిస్ శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. తమకు మగ శిశువు జన్మించాడని, అతడి పేరు సెల్డాన్ లైకర్గస్ అని ఎక్స్ లో ఒక పోస్ట్ లో వెల్లడించారు. తమ కుమార్తె అర్కాడియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ,ఈ విషయాన్ని కూడా బయటపెట్టారు. తన భాగస్వామి, ఏఐ ఎక్స్ పర్ట్ షివోన్ జిలిస్ ఎక్స్ లో పెట్టిన పోస్టుకు టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్ కూడా స్పందించారు. ఆ పోస్ట్ కు స్పందనగా హార్ట్ ఎమోజీని పోస్ట్ చేశారు.