హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్గా ‘దిల్రుబా’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అతని దగ్గర ఓ స్పెషల్ బైక్ వుంది. దాన్ని ఓ ఆర్ట్ డైరెక్టర్ అద్భుతంగా డిజైన్ చేశాడు. అది తనకు ఎంతో ఇష్టమైన బైక్ అని చెప్తున్నాడు కిరణ్. అయితే ఆ బైక్ తన అభిమానులకు ఇచ్చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. అయితే అంత ఆషామాషీగా ఆ బైక్ సొంతం చేసుకోలేం. దానికి మన మెదడుకు పదును పెట్టాల్సి ఉంటుంది. అతని కొత్త సినిమా దిల్‌రుబాకు సంబంధించి ఇప్పటివరకు పాటలు, టీజర్ వంటివి రిలీజ్ అయ్యాయి. అలాగే మీడియా సమావేశాల్లో సినిమాకి సంబంధించిన కొన్ని క్లూస్ కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఆడియన్స్ చెయ్యాల్సింది ఏమిటంటే.. దిల్రుబా స్టోరీ ఏమై ఉంటుంది అని కరెక్ట్‌గా గెస్ చెయ్యగలగాలి. అప్పుడే కిరణ్ తన బైక్‌ని గిఫ్ట్‌గా ఇచ్చేస్తాడు. అంతేకాదు ఆ బైక్‌ని గెలుచుకున్న వారితో కలిసి దిల్రుబా మొదటి షో చూస్తాడు. ఇదీ కిరణ్ అబ్బవరం ఇచ్చిన బంపర్ ఆఫర్.
కిరణ్ దగ్గర ఉన్న బైక్ బయట మార్కెట్లో దొరకదు. దాన్ని స్పెషల్‌గా డిజైన్ చేయించారు. తాజాగా అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు. అందులో ఆ బైక్‌కి సంబంధించిన డీటైల్స్ చెబుతూ ప్రేక్షకులు ఏం చెయ్యాలి అనేది కూడా చెప్పాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోస్ట్ క్రియేటివ్‌గా ఆలోచించి కథను గెస్ చేయడమే అసలు టాస్క్. ఒకవేళ అమ్మాయిలు ఈ బైక్ గెలుచుకుంటే అబ్బాయిలకు గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు అనే సలహా కూడా ఇచ్చాడు కిరణ్. ఈ కొత్త తరహా టాస్క్‌ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తామని కొందరు నెటిజన్లు ఎంతో కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజేతకు ఆ బైక్‌ని అందిస్తారు.