పిల్లలను విక్రయిస్తున్న నిందితురాలు సరోజిని…. ఢిల్లీ, గుజరాత్‌లతో సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఢిల్లీకి చెందిన ప్రీతి కిరణ్, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన అనిల్ సహకారంతోనే సరోజిని పిల్లలను అమ్ముతుందని పోలీసులు నిర్ధారించారు. వారిద్దరూ ఆయా ప్రాంతాల్లో చిన్నారుల ఫోటోలను ఆమెకు వాట్సాప్ ద్వారా పంపుతారు. వారిలో నచ్చిన పిల్లలను బేరమాడి కొనేది. డబ్బులను చెల్లించి పిల్లలను తెచ్చుకునేది. ఆ ఫోటోలను పిల్లల లేని జంటలకు చూపించి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అమ్మకానికి పెట్టేది. పిల్లలను అక్రమంగా విక్రయిస్తున్న ముఠాలో కీలక సూత్రదారులగా ఉన్న ప్రీతి కిరణ్, అనిల్‌ను పట్టుకుంటే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
Home Andhra Pradesh తీగ లాగితే డొంక కదిలింది…! విజయవాడలో పసిబిడ్డలను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్-child trafficking gang busted...