‘డాన్స్ చేసిన తర్వాత 1 కిలో నుండి 1.5 కిలోల వరకూ బరువు తగ్గుతాను’
ఫిట్‌గా ఉండటానికి డాన్స్ చేయడం ప్రాముఖ్యత, అది చేకూర్చే బలం , దాని కోసం ఆయన తీసుకునే శిక్షణ గురించిన వ్యాయామాల గురించి మాట్లాడుతూ, ఇలా ముచ్చటించాడు. “డాన్స్ అనేది నాకు కార్డియోవాస్కులర్ వ్యాయామం చేసినట్లుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు, ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తడం చాలా బోరింగ్‌గా ఉంటుంది. మీరు డాన్స్ చేస్తున్నప్పుడు, ఇష్టపడే సంగీతాన్ని వినడం లేదా కొరియోగ్రఫీని ఎంజాయ్ చేస్తూ ఉండటం వల్ల సమయం తెలియదు. కాబట్టి, మీరు మీ సెషన్ పూర్తి చేసే వరకు ఎన్ని కేలరీలు ఖర్చు చేశారో కూడా మీకు తెలియదు. నేను డాన్స్ చేసిన తర్వాత దాదాపు 1 నుండి 1.5 కిలోల వరకు బరువు తగ్గానని అనిపిస్తుంది.