హీరోయిన్గా మంచి సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకుంటున్న మీనాక్షి చౌదరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవప్రదమైన పదవిని కట్టబెట్టిందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఉమెన్ ఎంపవర్మెంట్ అంబాసిడర్గా మీనాక్షిని ప్రభుత్వం నియమించిందని ప్రచారం జరగడంతో మీనాక్షిని సోషల్ మీడియా ద్వారా అభినందిస్తున్నారు. అయితే ఈ వార్తలో నిజం లేదని, సోషల్ మీడియా సృష్టేనని తెలుస్తోంది. ఇప్పటికే ఈ వార్త బాగా ప్రచారంలోకి వచ్చేసింది. ఎవరో కావాలనే ఈ ప్రచారం చేస్తున్నారనేది తాజా సమాచారం.