అమీన్‌పూర్ పెద్ద చెరువులో ఎఫ్‌టీఎల్ స‌రిహ‌ద్దుల నిర్ధార‌ణ పేరిట జ‌రుగుతున్న దందాల‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ‘అమీన్‌పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల – జేఏసీ’ పేరుతో ప‌లువురు దందాల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు వ‌చ్చిన ఫిర్యాదుల‌ను క‌మిష‌న‌ర్ తీవ్రంగా ప‌రిగ‌ణించారు. జేఏసీ త‌ర‌ఫున కొంత‌మంది డ‌బ్బులు వ‌సూలు చేస్తున్న‌ట్టు ర‌సీదులు, వాట్సాప్ సందేశాల‌ను పరిశీలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here