రివేంజ్ డ్రామా…
సత్యమూర్తి ఫ్యామిలీని పరిచయం చేస్తూ సినిమా మొదలవుతుంది. మీరా పాత్ర ఎంట్రీ ఇవ్వడం, పెళ్లి ఏర్పాట్లతో ఆరంభ సన్నివేశాల్లోని కామెడీ పర్వాలేదనిపిస్తుంది. యాక్సిడెంట్లో కళ్యాణి గాయపడటం, సింగం, సత్యమూర్తి గొడవలతో కథ ఇంటర్వెల్ వరకు సాఫీగా సాగుతుంది. ఈ కేసులో తనను కావాలనే ఇరికించారనే నిజం తెలుసుకున్న సత్యమూర్తి …అసలు ఏం జరిగింది అన్నది తెలుసుకునే ప్రయత్నాల చుట్టూ సెకండాఫ్ అల్లుకున్నారు. కీలకమైన సెకండాఫ్ మొత్తం సాగతీతలా ఉంటుంది. రివేంజ్ డ్రామా ట్రాక్ ఔట్డేటెడ్లా అనిపిస్తుంది.