పార్వతమ్మ ఆనందం..
‘ఇన్నేళ్లు గడిచినా నన్ను గుర్తుపెట్టుకొని సీఎం హోదాలో రేవంత్ నా ఇంటికి రావడం చాలా గర్వంగా ఉంది. మా ఇంట్లో అద్దెకు ఉంటున్నప్పుడు కూడా పార్వతక్కా అని ఎంతో ప్రేమగా పిలిచేవాడు. ఇప్పుడు కూడా అదే ప్రేమతో పార్వతక్కా అని నన్ను దగ్గరకు తీసుకున్నాడు. రేవంత్ రెడ్డికి ఇష్టమని పూరి, కీమా చేసి పెట్టాను. ఇన్ని సంవత్సరాలు గడిచాక కూడా నన్ను గుర్తుంచుకొని నా ఇంటికి వచ్చారంటే ఆయనది ఎంత గొప్ప మనసు. వనపర్తిలో నా తమ్ముడు రేవంత్ నన్ను ఒక సెలిబ్రిటీని చేశాడు’ అని రేవంత్ రెడ్డి గతంలో అద్దెకు ఉన్న ఇంటి యజమానురాలు పార్వతమ్మ చెప్పారు.