శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్(SLBC) వద్ద ఫిబ్రవరి 22వ తేదీన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ ఇన్లెట్ సొరంగంలో ఉదయం 8.30 గంటల సమయంలో టన్నెల్ పైకప్పు కూలిపోయింది. ఆ రోజు నుంచి ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. దాదాపు 11కుపైగా ప్రత్యేక విభాగాలు ఇందులో నిరంతరం కష్టపడుతూనే ఉన్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కావటానికి మరికొంత సమయం పట్టే అవకాశం స్పష్టంగా ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.