తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు ఇంట్లో మున్నూరు కాపు నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కూడా హజరయ్యారు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లీడ్ చేయాల్సిన సమావేశానికి.. ప్రతిపక్ష పార్టీలను పిలవడమేంటని మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అటు బీసీ కులగణనపై ప్రభుత్వాన్ని విమర్శించడంపైనా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.