తెలంగాణలో మొత్తం 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రంలో టీచర్‌తో పాటు హెల్పర్ ఉంటారు. అంగన్వాడీ కేంద్రాల్లో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. గతంలో ఈ పోస్టులకు ఎంపికైన వారిలో పలువురు రాజీనామా చేయడం, కొందరు సూపర్‌వైజర్లుగా ప్రమోషన్ పొందడంతో అంగన్వాడీల్లో సిబ్బంది కొరత ఏర్పడింది. దీంతో పాటు 65 ఏళ్ల వయసు నిండినవారు రిటైర్డ్ అయ్యారు. రాష్ట్రంలో 65 ఏళ్ల వయసు దాటినా ఇంకా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు 3,914 మంది ఉన్నారు.