తెలంగాణ లాసెట్ షెడ్యూల్ – 2025 విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు…ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 15, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 4 వేల ఆలస్య రుసుంతో మే 25వ తేదీ వరకు గడువు ఉందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.