ఉదయం 8 గంటలకే ప్రారంభం….
మార్చి 3న ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు ప్రక్రియ రెండు రోజుల పాటు కొనసాతుందని తెలిపారు. కౌంటింగ్ కోసం మైక్రో అబ్జర్వర్లు, సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రాడ్యుయేట్ ఓట్ల కోసం మొత్తం 21 టేబుళ్లు, టీచర్స్ ఓట్ల కోసం 14 టేబుళ్ళు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి టేబుల్ వద్ద మైక్రో అబ్జర్వర్, సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియకు సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉన్నందున కౌంటింగ్ సిబ్బంది 3 షిఫ్ట్ లలో విధులు నిర్వహిస్తారని వెల్లడించారు.