భవనం కోసం నిధులు..
మున్నూరు కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కనీసం 20వేల మందికి విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. కోకాపేటలో గత ప్రభుత్వం 5 ఎకరాల భూమిని మున్నూరు కాపు భవన నిర్మాణం కోసం ఇచ్చింది. అక్కడ భూమి ఉన్న నేపథ్యంలో దాన్ని సమంతరం చేసి భవన నిర్మాణం చేసుకునేందుకు వీలుగా.. నిధులు పెంచాలని నేతలు కోరారు.