రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిళ్లకు భారతీయ వినియోగదారుల నుండి ఎల్లప్పుడూ గొప్ప స్పందన లభిస్తుంది. గత నెలలో అంటే 2025 ఫిబ్రవరిలో దేశీయ మార్కెట్లో 80,000కు పైగా మోటార్ సైకిళ్లను విక్రయించింది. ఈ కాలంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్ అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 18.96శాతం పెరిగాయి. గత నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటర్ సైకిల్ దేశీయ మార్కెట్లో మొత్తం 80,799 కొత్త కస్టమర్లను పొందింది. సరిగ్గా ఏడాది క్రితం అంటే 2024 ఫిబ్రవరిలో 67,922 కొత్త కస్టమర్లు వచ్చారు.