దీంతో పెన్షనర్లు తమకు పెన్షన్ ఇవ్వాలని సచివాలయ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. దీంతో దాచేపల్లి నగర పంచాయతీ కమిషనర్ అప్పారావు స్పందిస్తూ ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని, అందరికీ పెన్షన్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. వారి సచివాలయం పరిధిలో పెన్షనర్లకు కేటాయించిన రూ.34.18 లక్షలను శుక్రవారం విత్డ్రా చేశారని, ఆ మొత్తాన్ని పెన్షనర్లకు పంపిణీ చేసేందుకు ఎనిమిది మంది సచివాలయ ఉద్యోగులకు ఆయన ఇవ్వాల్సి ఉందని అన్నారు. అయితే ఆరుగురు సచివాలయ ఉద్యోగులకు మాత్రమే నగదును ఇచ్చాడని, అయితే ప్రసాద్ పంపిణీ చేయాల్సిన నగదును, వేరొక సచివాలయ ఉద్యోగి పంపిణీ చేయాల్సిన నగదు మొత్తం రూ. 8,43,500 ఆయన వద్దనే ఉంచుకున్నాడు.
Home Andhra Pradesh రూ.8 లక్షల పెన్షన్ డబ్బులతో సచివాలయ ఉద్యోగి పరారీ, ఆందోళనలో పెన్షనర్లు-dachepalli secretariat employee absconds...