గాజులు ఎప్పుడు వేసుకోవాలి?
- ఎప్పుడైనా సరే ఎవరైనా కొత్త గాజులను వేసుకునేటప్పుడు, వాటిని గౌరీ దేవి ముందు ఉంచడం మంచిది. అలా ఉంచాక, వాటిని ధరించాలి. ఇలా చేయడం వలన వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
- గాజులు వేసుకుంటే భార్యాభర్తల బంధం బాగుంటుంది. వైవాహిక జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి.
- ఉదయం లేదా సాయంత్రం సమయంలో కొత్త గాజులని వేసుకోవచ్చు.
- శాస్త్రం ప్రకారం మంగళవారం, శనివారం కొత్త గాజులని కొనుగోలు చేయకూడదు. ఇలా చేయడం వలన భర్తకు దురదృష్టం కలుగుతుంది.
- స్త్రీలు గాజులు వేసుకుంటే తన ఆరోగ్యం తన భర్త ఆరోగ్యం కూడా బాగుంటుంది.
- ఆదివారం, శుక్రవారం నాడు కొత్త గాజులు వేసుకోవడానికి ఉత్తమ రోజులు.
గాజులు వేసుకునేటప్పుడు పాటించాల్సినవి, పాటించకూడనివి
- గుండ్రని ఆకారంలో ఉండే గాజులు బుధుడు, చంద్రుడిని సూచిస్తాయి. ఇవి ధరిస్తే మంచిది.
- గాజు గాజులు పవిత్రమైనవి. గాజు గాజులని వేసుకోవడం వలన, వాటి వలన వచ్చే శబ్దం ప్రతికూల శక్తిని తొలగిస్తుంది.
- గాజు గాజులు వేసుకుంటే బుధ గ్రహం అనుగ్రహం ఉంటుంది. జాతకంలో శుభ ఫలితాలు వస్తాయి.
- బంగారు గాజులు వేసుకునేవారు బంగారం గాజులతో పాటుగా ఒక గాజు గాజు వేసుకునేటట్టు చూసుకోండి.
- పెళ్లయిన స్త్రీలు తెలుపు, నలుపు రంగు గాజులు వేసుకోవడం మంచిది కాదు. ఇది దురదృష్టాన్ని, ప్రతికూల శక్తిని కలిగిస్తాయి.
- పెళ్లి కాని వారు ఏ రంగు గాజులనైనా వేసుకోవచ్చు.
- మణికట్టు మీద గాజులు పడినప్పుడు రక్తప్రసరణ జరిగి రక్తపోటు పెరిగే అవకాశాలని తగ్గిస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.