భోజేశ్వర్ మహాదేవ ఆలయం
- ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఇది పూర్తి కాలేదు. ఈ ఆలయ వైభవం ఇప్పటికీ చర్చనీయాంశమే.
- ఈ శివ లింగం 7.5 అడుగుల ఎత్తులో ఉంది.
- ఈ ఆలయం ప్రాచీన భారతదేశము యొక్క సామాజిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక నిర్మాణ అంశాల గురించి సమాచారాన్ని ఇస్తుంది.
- సృజనాత్మకత, గొప్పతనానికి ఈ ఆలయం ఉదాహరణ అని చెప్పొచ్చు.
- ఇక్కడ ఉన్న పెద్ద శివలింగం సంక్లిష్టంగా చెక్కబడిన అంశాలు, పరమర రాజవంశం యొక్క కళాత్మక, ఇంజనీరింగ్ నైపుణ్యాలని తెలుపుతుంది.
- ప్రతీ ఏడాది మహా శివరాత్రి రోజున ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు వచ్చి పూజలు చేస్తారు.
- శివలింగం పెద్ద పరిణామం కారణంగా పూజారి మెట్లు ఎక్కి పూజలు చేయాల్సి ఉంటుంది.
- ఈ ఆలయం నాలుగు పెద్ద స్తంభాలపై ఉంది.
ఈ ఆలయం ఎందుకు పూర్తి కాలేదు?
కొన్ని మత విశ్వాసాల ప్రకారం, ఆలయ నిర్మాణం కేవలం ఒక రాత్రిలో పూర్తి చేయాలి. లేదంటే నిర్మించడం కుదరదట. అయితే అలా పూర్తి కాకపోవడం వలన ఇప్పటికి కూడా అది పూర్తి కాలేదని ప్రజలు అంటూ ఉంటారు.