వయస్సు పెరుగుతున్న కొద్దీ మెదడు పనితీరు మందగించడమే సాధారణమే కానీ, అల్జీమర్స్ వ్యాధి వచ్చిన వారిలో వయస్సు కంటే ఎక్కువ సమస్యలు కనిపిస్తాయి. పైగా, ఈ అల్జీమర్స్ అనగానే మనకు గుర్తొచ్చేది మహిళలే, ఎందుకంటే ఎక్కువ మంది మహిళలే ఈ వ్యాధికి గురవుతుంటారు. కానీ, కొత్త పరిశోధనల ఫలితంగా పురుషులకు వ్యాధి తక్కువగా వచ్చినప్పటికీ, వ్యాధి వ్యాప్తి పురుషుల్లోనే ఎక్కువగా ఉండి వారి జ్ఞాపక శక్తి త్వరగా మందగిస్తుందట. అల్జీమర్స్ వచ్చిన వారికి మెదడులో అమైలాయిడ్ ప్లాక్స్ పేరుకుపోతుంది. ఫలితంగా మెదడు ఆరోగ్యం, జ్ఞాన సామర్థ్యం వంటి జీవ సంకేతాలు వేగవంతంగా క్షీణిస్తాయి.