కరీంనగర్ – నిజామాబాద్- ఆదిలాబాద్-మెదక్ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీగా భారీ విజయం సాధించి గెలుపు పత్రాన్ని అందుకున్న మల్క కొమరయ్యను అభినందించేందుకు కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియం వద్దకు వచ్చిన బండి సంజయ్ ఈ సందర్భంగా మల్క కొమరయ్య, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు క్రిష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, తపస్ రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావులతో కలిసి మీడియాతో మాట్లాడారు.