మహాకుంభమేళాలో ఫేమస్ అయిన మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఐఐటీ బాబాను జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి కేసులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఓ హోటల్లో గంజాయి సేవిస్తూ ఐఐటీ బాబా పోలీసులకు కనిపించాడు. బాబా ఆత్మహత్య చేసుకుంటున్నాడని తమకు సమాచారం అందిందన్న పోలీసులు.. వెంటనే హోటల్ కి వెళ్లగా బాబా గంజాయి తీసుకుంటూ కనిపించాడన్నారు. బాబాను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత బెయిల్ పై విడిచిపెట్టారు.