స్పృహలేని స్థితిలో సింగర్
దీంతో అసోసియేషన్ సభ్యులు కల్పన భర్తకు కాల్ చేసి విషయం తెలిపారు. ఆయన కూడా కల్పనతో మాట్లాడేందుకు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో అసోసియేషన్ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఆమె ఇంటికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు తలుపులు పగులకొట్టి ఇంట్లోకి వెళ్లారు. ఇంట్లో స్పృహలేకుండా పడి ఉన్న సింగర్ కల్పనను పోలీసులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కల్పన భర్త చెన్నైలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు సమాచారం అందించారు. ప్రస్తుతం కల్పనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి ఇంకా కారణాలు తెలియాల్సి ఉంది.