పదవుల భర్తీ..
తెలంగాణ అసెంబ్లీ ఇటీవల ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపింది. ఆ మేరకు కాంగ్రెస్లో పదవుల భర్తీ ఉంటుందని నేతలు చెబుతున్నారు. ప్రధానంగా మాల, మాదిగ వర్గాల నేతలకు ఎమ్మెల్సీ టికెట్లు, నామినేటెడ్, మంత్రి పదవుల భర్తీలో ఎస్సీ వర్గీకరణ ప్రకారం ప్రాధాన్యమిస్తారని ప్రచారం జరుగుతోంది. అటు తమకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని రెండు సామాజిక వర్గాల నేతలు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.