ఏపీ శాసన మండలిలో దిశ యాప్ పై వాడి వేడి చర్చ జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఈ యాప్ ను ఎందుకు ఉపయోగించటం లేదని ప్రశ్నించారు. ఈ యాప్ ఉన్నప్పుడు ఆడ వాళ్లకు రక్షణ ఉండేదని అన్నారు. ఈ క్రమంలోనే కలుగజేసుకొని మాట్లాడిన హోం మంత్రి అనిత, చట్టం ఎక్కడ చేశారని నిలదీశారు. మగాళ్లతోనూ బలవంతంగా యాప్ డౌన్ లోడ్ చేయించారని మండిపడ్డారు.