ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేశారు. హైదరాబాద్ నిజాంపేటలోని వర్టెక్స్ ప్రీ విలేజ్ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్న కల్పన, నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్టు సమాచారం. రెండు రోజులుగా ఇంటి తలుపులు ఓపెన్ చేయకపోవడం, ఫోన్ కి అందుబాటులో లేకపోవడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపులు పగులగొట్టిన పోలీసులు.. అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఆమె చికిత్స పొందుతున్నారు. కాగా కల్పన ఆత్మహత్యాయత్నంకు కారణం తెలియాల్సి ఉంది. (Singer Kalpana)

 

టాలీవుడ్ లో పాపులర్ సింగర్స్ లో కల్పన ఒకరు. కేవలం సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‏గా, నటిగా తనదైన ముద్ర వేశారు. బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గానూ సందడి చేశారు. 

 

సినీ పరిశ్రమలో ఎంతో పేరు పొందిన కల్పన.. గతంలో తాను ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నట్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు తాజాగా ఆమె ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనంగా మారింది.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here