తన తల్లి కల్పన ఆత్మహత్యాయత్నం చేసిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె కుమార్తె మీడియా ముఖంగా తెలియజేశారు. ఆమెకు స్ట్రెస్‌ ఉందని, దానికి సంబంధించి వైద్యులు సూచించిన మెడిసన్స్‌ తీసుకుంటారని, అయితే అది డోస్‌ కాస్త ఎక్కువ కావడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది తప్ప ఆత్మహత్యాయత్నం చేసిందనే మాట అవాస్తవం అని కల్పన కుమార్తె స్పష్టం చేశారు. ఇప్పటికే మీడియా తన తల్లి గురించి అనవసరమైన ప్రచారం చేస్తోందనీ, దయచేసి దాన్ని ఆపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తన తల్లి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, త్వరలోనే కోలుకొని అందర్నీ కలుస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. 

సింగర్‌ కల్పన ఆత్మహత్యాయత్నం చేసిందనే వార్త మంగళవారం సాయంత్రం నుంచి మీడియాలో ప్రముఖంగా వస్తోంది. అంతేకాదు, సోషల్‌ మీడియాలో కూడా దీనిపై రకరకాల కథనాలు వేస్తున్నారు. హైదరాబాద్‌ నిజాంపేటలోని వర్టెక్స్‌ ప్రీ విలేజ్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో నివాసం ఉంటున్న కల్పన.. రెండు రోజులుగా ఇంటి తలుపులు ఓపెన్‌ చేయకపోవడం, ఫోన్‌కి అందుబాటులో లేకపోవడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపులు పగులగొట్టిన పోలీసులు.. అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో ఆమె చికిత్స పొందుతున్నారు. సౌత్‌లో మంచి సింగర్‌గా పేరు తెచ్చుకున్న కల్పన గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్టు తెలిపారు. దీంతో కల్పన ఆత్మహత్యాయత్నం అనే వార్తకు ఎక్కువ ప్రాధాన్యం చేకూరింది. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here